వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

10 వ శ్లోకం

ప్రయాణకాలే మనసాऽచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్|| 8-10 ||

అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు

© Copyright Bhagavad Gita in Telugu