వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

4 వ శ్లోకం

అర్జున ఉవాచ|
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన|| 2-4 ||

అర్జునుడన్నాడు:
మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను?

శ్రీ సిద్దమంగళ స్తోత్రం

 

సిద్ధమంగళస్తోత్రం కోసం..

ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గానీ, పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గానీ శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ప్రసాదించగలరు.

శ్రీబాపనాచార్యులు, శ్రీపాదవల్లభ స్వామి వారికి తాత గారు. శ్రీపాదవల్లభ స్వామి తమ తాత గారికి ఒక వరమును ఇచ్చిరి. *తాతా! "మరు జన్మలో నేను నీ రూపంతో, నీ పోలికలతో నరసింహా సరస్వతి గా జన్మిస్తాను" అని వరమును ఇస్తారుఅదేవిధంగా స్వామి వారు కారంజా క్షేత్రంలో నరసింహా సరస్వతి గా జన్మించి, తర్వాత గంధర్వపురమును తమ స్థిరనివాసముగా చేసుకున్నారు.

శ్రీపాద శ్రీవల్లభులవారిని భజించువారికి యిహలోక సుఖము, పరలోక సుఖము పుష్కలముగా లభించును. శ్రీబాపనాచార్యుల వారు తమ మనవడిని సాక్షాత్తూ దత్తాత్రేయులుగా దర్శించి "సిద్ధమంగళస్తోత్రమును" పఠించిరి. దత్త దర్శనమున కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతీ అక్షరమునందును యుగయుగాంతముల వరకూ చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషములు వెదకరాదు. సిద్ధమంగళస్తోత్రమును పఠించుటకు రకములయిన విధినిషేధములు లేవు.

శ్రీ సిద్దమంగళ స్తోత్రం

 1.శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 2.శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 3.మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 4.సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 5.సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 6.దో చౌపాతీ దేవ్లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 7.పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 8.సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 9.పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

 

పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.

ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః