వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

16 వ శ్లోకం

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోऽన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః|| 2-16 ||

అసత్యానికి శక్తి లేదు. సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదు. ఈరెండింటి అసలు స్వరూపం తత్వ జ్ఞానులచేత దర్శింప బడినది.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

56. ప్రస్తుత కాలంలో బతుకులు జీవన ప్రధానంగా సాగుతున్నాయి. ఏదో ఒక విధంగా అధికంగా సంపాదించడమే ఎక్కువమంది బుర్రల్లో సదా సాగే ఆలోచన.డబ్భుకు యిచ్చిన ప్రాధాన్యత,వాడు ఎటువంటి వాడైన సరే సంపదలువుంటేచాలు వాడికి యెక్కడలేని మర్యాదలు యిస్తారు. ప్రజలు జీవనానికి ఇస్తున్న ప్రాధాన్యం కర్తవ్యానికి ఇవ్వడంలేదు. న్యాయార్జిత సంపాదన ద్యేయంగా ఉండునట్లు కర్తవ్యాన్ని భోదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 57.దానం అయిదు రకాలు- ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివల్ల దాతకు ఇహలోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమగతీ కలుగుతాయి. అసూయ లేకుండా ఇస్తే అది ధర్మదానం. యాచకులు ప్రశంసిస్తూ ఉండగా ఇస్తే అది అర్థదానం. దానం ఇవ్వకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేది భయదానం. ఇష్టమైన వ్యక్తికి ఇస్తే కామ దానం. పేదవాడికి జాలితో ఇచ్చేది కారుణ్య దానం. వీటిలో రకమైన దానమైనా అది పుణ్యాన్ని, కీర్తిని ప్రసాదిస్తుంది. అటువంటి దానబుద్దిని కలిగించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

58. ‘దానంతో, తపస్సుతో స్వర్గానికి వెళ్ళవచ్చు గదా! రెండింటిలో ఏది ఉత్తమమైనది?’ అని ధర్మరాజు భీష్ముణ్ని ప్రశ్నించాడు. దానికి భీష్ముడి జవాబు- ‘తపస్సు ప్రభావం వల్ల పవిత్ర హృదయులైన రాజులు ఉత్తమ గతులు పొందుతారు. ధర్మపరాయణులైన రాజులు దాన పుణ్యాసక్తులై నిస్సందేహంగా ఉత్తమ లోకాలకు వెళ్తారు. మార్గాలు వేరైనా ఫలితం ఒకటే! అయితే రెండో మార్గంలో వెళ్లాలంటే ధనం పుష్కలంగా ఉండాలి! దానధర్మాలు ఆచరించుటకు ఉత్తమ సంపదను యివ్వు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 59.పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా సాగే ప్రయాణమే నేను. ప్రాణశక్తి అయిన ఊపిరే నేను. ఊపిరి ఉన్నంత కాలం నేను అనే బావన ఉంటుంది. పుట్టుక చావుల మధ్యకాలంలో సాగే జీవన స్రవంతిలో నేను ఎన్నొ ఎన్నో పోగడలు పోతుంది,విన్యాసాలు చేస్తుంది. నాది అనే బావన నేనులోంచి పుడుతుంది. నాది లోనుంచి నా వాళ్ళు,నా భార్య,నా పిల్లలు,నా కుటుంభం,నా ఆస్తి, నా గొప్ప,నా కీర్తి, నా ప్రజ్ఞ, యిలా అనేవీ పుట్టుకొస్తాయి. చివరికి నేను భూమండలాన్ని,ఆకాశహద్దును కూడా దాటి విశ్వరూపమై అహం అనే మాయపొర కమ్మి నేనే సర్వంతర్యామినీ అని విర్రవీగుతుంది.పగలు,పంతాలు,ప్రతికారాలతో జీవితాలను నాశనముచేస్తారు. అటువంటి అహంతో కూడిన జీవితము నాకు వద్దు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

60.అంతా నేనే అనుకునా నేను ఎప్పుడో ఒకప్పుడు సర్వబందనాలు వదిలి మరుభూమిలో చితిమంటల మధ్య బూడిద కావలసిందే. నేను లెకుండానే రోజులు మారుతాయి. ఊపిరితో మొదలైన నేను ఊపిరితోనే ఆగిపోతుంది, అందుకే ప్రాణము పోకముందే నేను గురించి తెలుసుకోమని భగవధ్గీత అంటున్నది. నేను గురించి సంపూర్ణముగా తెలుసుకోడమే వైరాగ్యము. అంతేకాని అన్ని వదలుకోడము నైరాగ్యము కాదు.తామరాకుపై నీటి బొట్టులా, దేనిపై మోహం లేకుండ జీవించడమే వైరాగ్య స్థితి. దేవా! ఆనంద స్వరూపా! నాకా వైరాగ్య స్థితిని అనిగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 61.స్వర్గ నరకాలు యిక్కడే వున్నాయి. మనలోనే ఉన్నాయి. నరకం అంటే ఆత్మదృష్టి నశించి,మనిషి భాహ్యదృష్టితో జీవించడం. అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమే- స్వర్గం. జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.

నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి’- అంటే- ‘అన్నీ నేనేఅనే స్థితి నుంచిత్వమేవాహమ్‌’... అంటే- ‘నువ్వే నేనుఅని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని నాకు కలుగజేసి నా యీ మానవ జన్మకు సార్థకత సిద్ధింపజేయి తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 62.జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. పరమాత్మా! అనుగ్రహంకై సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ప్రార్ధిస్తున్నాను. భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకుంటున్నాను. పరమాత్మా! గజేంద్రుడిలా నీవు పలికేంతవరకు నీ ప్రార్ధన ఆపను తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 63. జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, భవసాగరంలో ఈదలేను, జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, వాసనాబంధాలను తీసివేయి, వీటి అన్నింటనందు విముక్తి కల్గింమమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటున్నాను, కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి చేస్తున్నాను. సుదర్శనచక్రమనే జ్ఞానముతో నా అజ్ఞాన అహంభావనను సంహరించి పిదప ఆత్మసాక్షాత్కారం కలిగించు తండ్రీ!.

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 64.ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. "గజేంద్ర మోక్షం" కథ దీనిని తెలియజేస్తున్నది.

 'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి'

సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం

అటువంటి మోక్షస్థితి నిన్ను స్తుతించినందరికీ అనుగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత