వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

15 వ శ్లోకం

యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం సోऽమృతత్వాయ కల్పతే|| 2-15 ||

పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

51.వర్తమానం పారే నది అనుకుంటే .ఒక గట్టు భూతకాలమైతే,రెండవ వొడ్డు భవిష్యత్తు కాలము వంటిది. ఒక గట్టు నుంచి రెండవ గట్టు చేరుకోవాలంటే నదిని ఈదవలసిందే. అలాగే నిన్నటి ఆనుభవముతో రేపటి భవిష్యత్తుకు రూపమివ్వాలంటే కష్టపడి పని పనిచేయాలి. పనిని ధ్యానములా,దైవకార్యములా భావించి,శ్రద్ధాభక్తులతో దైవప్రార్త్ర్హనలా చేస్తే దొరికేది ఆనందము. ఆనందమనే అంతర్యామిని దక్కేలా దీవించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 52.ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణాను బందాలేకాదు జన్మరాహిత్యమే జరుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లబిస్తూంది...మోక్షమంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అనుకుంటారు. కాని అదికాదు మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...దైవం ఏఏరూపాలలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు. ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైయింది. నేనెవరిని. ఎక్కడనుండి వచ్చాను మల్లీ ఎక్కడికి వెలతాను. అసలు మాయ అంటే ఏమిటి???? ఇలా ఎన్నో సృష్టి రహస్యలు బ్రతికుండగానే తెలిసిపోతాయి ఇదే మోక్షం. అటువంటి గురువుగా నాకు లభించి మరు జన్మలేకుండ మోక్షాని పొందేమార్గాన్ని ఉపదేశించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 53.ధర్మో రక్షతి రక్షితఃఅను సూక్తి అందరికీ తెలిసినదే. మనం ధర్మాన్ని రక్షిస్తే... ధర్మం మనలను రక్షిస్తుంది... అని దాని అర్థం. రక్షించడం అంటే.. కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం.

ఆలస్యం అమృతం విషంఅనే సూక్తితో పాటునిదానమే ప్రధానంఅనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి.

మంచి పని చేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడుఆలస్యం అమృతం విషంఅనే సూక్తిని పాటించాలి. చెడు పని చేసే విషయంలోనిదానమే ప్రదానంఅనే సూక్తిని పాటించాలి. అదే దర్మసూక్ష్మం. సూక్ష్మాన్ని గ్రహించగలిగినవాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు. ధర్మసూక్ష్మాన్ని గ్రహించేశక్తిని మరియు ధర్మాన్ని కాపాడే విజ్ఞతను నాకు ప్రసాదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 54.నువ్వు తిన్నది నేలపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలుఅని లోకోక్తి. ఎంత కోటీశ్వరుడయిన అందరు తినే ఆహారమే తింటాడు.కాని బంగారము తినలేడు. ఒకరికి ఇవ్వకుండా, తాను అనుభవించకుండా ఉంటే అది తుదకు దొంగలపాలే!

అస్థిరమైనది- ధనం! డబ్బు అంతటి నిలకడ లేనిది మరొకటి లేదు. సంపదకు ప్రతీకలక్ష్మి’. లక్ష్మీదేవికిచంచలఅని పేరు. అది ఎక్కడ దాచినా దాగదు. దొంగలపాలు కావచ్చు. అగ్నికి ఆహుతి కావచ్చు. తుదకు ప్రభుత్వమే ప్రజోపయోగార్థం లాక్కోవచ్చు.

న్యాయార్జిత విత్తంకొబ్బరికాయలో నీరులా వచ్చి చేరుతుంది. అది ఆరోగ్యకరం, రుచికరం. అధర్మ సంపాదన ఓటికుండలో నీరు వంటిది. అది ఏనాటికైనా నేలపాలు కాక తప్పదు. న్యాయార్జితమువైపు నన్ను మరల్చు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 55.పాత్రతనెరిగి దానం చేయాలి. అపాత్రదానం అపాయకరం. అసలు దానం పుచ్చుకోవడాన్నే తప్పుపడతాయి ధర్మశాస్త్రాలు. ‘అపరిగ్రహణంఅనేది ఒక ఉత్తమ వ్రతం. ఎవరినీ యాచించి ధనం తీసుకోకపోవడమే వ్రత లక్షణం. ఒకవేళ తీసుకోవలసి వస్తే, ముందుగా దాత చేతిలో ఏదైనా పెట్టి, తరవాతే పుచ్చుకోవాలంటారు. భార్యామణి బలవంతంపై, కుచేలుడు శ్రీకృష్ణుణ్ని అర్థించడానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరవాత నోరు పెగలలేదు. తీసుకెళ్ళిన అటుకుల్ని ఇస్తే కృష్ణుడు ఆప్యాయంగా భుజించాడు. కుచేలుడు తానుగా యాచించలేదు. పరమాత్మా! నీ దయ ప్రసరిస్తే ఎవరికి సమయంలో ఏది లభించాలో అది లభించకుండా ఉంటుందా! తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత