వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము

||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

12 వ శ్లోకం

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః|
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్|| 2-12 ||

నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి ని పాలించు రాజులు కూడా ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడా మనమందరము లేకపోవుట అనునదే లేదు.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

33. కత్తితో శతృవును గెలవగలము

ఆలోచనతో మనసును మాత్రమే గెలవగలము

అనుభవముతో ఆశయాన్ని గెలవగలము

పుస్తకముతో ప్రపంచాన్ని గెలవవచ్చును.

కాని భక్తితో,సేవతో భగవంతున్ని పొందవచ్చును. అటువంటి భక్తి,నిన్ను సేవచేసుకునే భాగ్యము అనుగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

34.   పావనా! నిన్ను నేను చెంచులక్ష్మీ సమేతా! లక్ష్మిరమణా, సంపద ప్రదాతా,చిన్మయ రూపా, నరసింహా! నారాయణా! అని అన్ని సమయములందు విడువక స్తోత్రము చేయుచు ఉందును. దానికి ఫలముగా నీవు నా హృదయము నందు ఎల్లవేళలా కొలువుతీరుము దయానిధీ!నా పాపములను నశింపజేసి నాకు  ముక్తిని ప్రసాదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 35. నిజ జీవితంలో మనిషికి కావాల్సింది భరోసా... నేను ఉన్నాను అనే భరోసా...ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట. మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో.. బలంతో మనిషి ఏదైనా చేయగలడు. భగవంతుని సేవతోపాటు,నా తోటివారికి ఎంతోకొంత సహాయపడి,మెరుగైన సమాజాన్ని నిర్మించుటలో నేనూ కూడా పాలుపంచుకునేలా దీవించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 36. జీవితములో సమస్యలు ఎదురైనపుడు,మనం ఒకరి ఓదార్పు కొరకు వెదుకుతాము.కాని జ్ఞానులు మాత్రము సమస్యకు సమాదానము అంతరంగమునుంచే కనుగొని అంతర్ముఖులౌతారు. భహవంతుడా! నా హృదయం నీతో అనుసంధానం అయి, అది ఆనందంతో ఉండునట్టి, యిటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 37. జ్ఞానముతో అంతర్ముఖులై మెలిగినప్పుడు బాహ్యప్రపంచము సుందరంగా,ఒక కొత్త శోభను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. రెండిటికి సంబందము తెలియక జీవనము చాలా కష్టతరంగా బావిస్తున్నాము. బాహ్యాన్ని, అంతరాన్ని విశ్వాసము అనే ముడితో ఏకం చేసి కష్టాలనుండి బయటపడే చలించని దైర్యాన్ని,నశించని విశ్వాసాన్ని ప్రసాదించు.నా సంరక్షణ భారం నీదే,నీ మార్గదర్శకత్వం నాకు ఆసరా కావాలి తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 38. మన ధర్మం యొక్క గొప్పదనాన్ని పాశ్చాత్య దేశాల్లోని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పుతున్నారు. కాని మనదేశములోని వారు మన ధర్మం యొక్క గొప్పదనం తెలుసుకో లేకపోతున్నారు. ఇతరులు మన ధర్మాన్ని తెలుసుకుంటున్నందుకు సంతోషపడాలా లేదా మనవారు మన ధర్మాన్ని విస్మరిస్తున్నందుకు బాదపడాలో తెలియడము లేదు స్వామీ!మన ధర్మాన్ని కాపాడే భాద్యత నీదే తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత