వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము

||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

10 వ శ్లోకం

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః|| 2-10 ||

భారతా! రెండుసేనల మధ్య విషాదంలో పడిన అతణ్ణి చూసి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

18.శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం

నవవిద భక్తిమార్గాలైన  శ్రవణ భక్తి, కీర్తనా భక్తి, స్మరణ భక్తి , పాదసేవన భక్తి , అర్చన భక్తి , వందన భక్తి,దాస్య భక్తి, సఖ్య భక్తి మరియు ఆత్మ నివేదన భక్తిలలో ఏదో ఒక భక్తిమార్గముతో నిన్ను సేవించేలా అనుగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 19 శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. అటువంటి శ్రవణ భక్తి నాకు ప్రసాదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 20 కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు. అటువంటి శ్రవణ భక్తిలో నాకు అణువంతైనా ప్రసాదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 21.  స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు. ఆవిదముగా అణుక్షణం నిన్ను తలచుకునేలా ప్రసాదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

22.   పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు పాదసేవ ద్వారా ముక్తులైనారు. స్వామీ! దయామయా! కనీసము యీ సేవైనా చేసుకునే భాగ్యము కల్గించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 23.అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్ఠించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.అలాంటి అర్చనతో నిత్యము నిన్ను పూజించేలా అనుగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 24.వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఫలితాన్ని పొందలేడు. అటువంటి వందన భక్తితో నిత్యము కొలిచెదను తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 25.దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు. అటు సేవాభక్తిని యివ్వు,దాసుడనై నిన్ను సేవించుకుంటాను తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 26.సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు. స్వామి దశావతారా! సఖ్య భక్తి అర్హత నాకు ఒసగుము తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 27.ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు. లోకనాయకా! శ్రీహరి అవతారమూర్తీ! ఆత్మ నివేదన భక్తిమార్గము చూపు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత