వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

41 వ శ్లోకం

అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః ||1-41||.

కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.

© Copyright శ్రీ భగవధ్గీత

కశ్యపుడు

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.కశ్యపుడు 'ఆకారాత్‌ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.

ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి. ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

కశ్యపుని వంశవృక్షం

  • కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముని చేరింది.[1].
  • కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
  • కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు.[2]
  • కశ్యపునికి కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు.
  • భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.

ప్రస్థానము

1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు.శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-

దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు. [1]  కశ్యప సంతానం  

కశ్యపుడు తన వివిధ భార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి:

  • బిందు జాబితా
  • దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు.
  • అదితికి పుట్టినవారు దేవతలు, ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి.
  • దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే.
  • సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు.
  • క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు.
  • వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు.
  • కద్రువకు జన్మించినవారు నాగులు.
  • మనుకు జన్మించిన వారు మానవులు.
  • అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి

1. దితి    2. అదితి  3. దను   4. కష్ట     5.అరిష్ట     6. సురస  7. ఇళ   8. ముని   9. క్రోధావసు 10. తమ్ర    11. సురభి 12. సరమ    13. తిమి అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం.

  • తిమి వల్ల జన్మించినవి జలచరాలు,  
  • సరమ వల్ల భయంకరమైన జంతువులు,
  • సురభి వల్ల గోవులు, గేదెలు, తదితర గిట్టలు పగిలిన జంతువులు,
  • తమ్ర వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు,
  • ముని వల్ల దేవతలు, అప్సరలు,
  • క్రోధావసు వల్ల సర్పాలు, దోమలు, తదితర కీటకాలు,
  • ఇళ వల్ల చెట్టు, పాకుడు తీగలు,
  • సురస వల్ల చెడు ఆత్మలు,
  • అరిష్ట వల్ల గుర్రాలవంటి గిట్టలు పగలని జంతువులు, (కిన్నెరలు, గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ),
  • విశ్వ వల్ల యక్షులు,
  • దితి వల్ల 49 మంది వాయుదేవులు,
  • అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు.
  • మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది.

అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6గురు కుమార్తెలు జన్మించారు. వారు : సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.

వీరివల్ల కూడా భూమిమీద సృష్టి జరిగింది. సుఖి చిలుకలు, గుడ్లగూబలకు; సేని గద్దలకు; గృధి రాబందులు, పావురాలకు; సుచి హంసలు, కొంగలు, బాతులకు; సుగ్రీవి గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెలవంటి వాటికీ జన్మను ఇచ్చాయి.

వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు

వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. 

కాశ్యప గోత్రము

హిందూ సమాజములో సంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రము తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును. అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను.

శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే | ; యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||

తాత్పర్యము :- ప్రజలు కశ్యపుని వలన జన్మించారు అని శ్రుతివాక్యము.