వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

20 వ శ్లోకం

అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20|| .

అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు,

పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు.

దుర్యోధనుడు

మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రథముడు, కౌరవాగ్రజుడు. సుయోధనుడు అని ఇతనికి మరొక పేరు.

జననం

ఇతడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి, ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరువాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురత వలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయం విన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరువాత నూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనుడు జన్మించాడు. తరువాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక, దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.

దుశ్శకునములు,పెద్దల సూచన

దుర్యోధనుని జననకాలములో రాక్షసులు మిక్కుటముగా అరచారు, నక్కలు ఊళలు పెట్టాయి, గాడిదలు ఓండ్ర పెట్టాయి, భూమి కంపించింది, మేఘములు రక్త వర్షాన్ని కురిపించాయి. ఇవి కాక అనేక దుశ్శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించబడింది. ఇవి గమనించిన భీష్ముడు, విదురుడు ధృతరాష్ట్రునికి "రాజా! దుర్యోధనుడు వంశనాశకుడు కాగలడని శకునములు సూచిస్తున్నాయి. ఇతనివలన కులనాశనం కాగలదు. ఈ పాపాత్ముని విడిచి కులమును రక్షింపుము " అని సూచించారు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో వాటిని పెడచెవిన పెట్టినట్లు భారత వర్ణన.

భారతంలో దుర్యోధనుని పాత్ర

దుర్యోధనుడు అసూయకు మారుపేరు. అతడు పాండవులపై అకారణ శతృత్వాన్ని పెంచుకున్నాడు. ముందుగా భీముని బలము అతనికి భయాన్ని కలిగించింది. అతణ్ణి ఎలాగైనా తుదముట్టించాలనుకున్నాడు. భీముని ఒకసారి లతలతో కట్టి నదిలో పారవేయించాడు, ఒకసారి సారధిచే విష్నాగులతో కాటు వేయించాడు, మరి ఒకసారి విషాన్నాన్ని తినిపించాడు. భీముడు వీటన్నిటిని అధిగమించి అధిక బలాన్ని సంపాదించాడు. అలా అంతఃపుర కుట్రలకు చిన్నతనంలోనే పాల్పడ్డాడు.
అర్జునునికి ప్రతిగా తన పక్షంలో ధనుర్విద్యాయోధుడు ఉండాలని దుర్యోధనుడు భావించాడు. యుద్ధ విద్యా ప్రదర్శన సమయంలో ప్రవేశించిన కర్ణుని అర్జునునికి ప్రతిగా తనకు బలం చేకూర్చుకొనే విధంగా కర్ణునికి అంగ రాజ్యం ఇచ్చి అతడి మైత్రిని సంపాదించుకున్నాడు. ధర్మరాజుకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి సహించలేక తండ్రిని ఒప్పించి వారణావతానికి పాండవులను పంపించి, వారిని అక్కడే హతమార్చాలని పథకం వేసాడు. శకునితో కుట్ర జరిపి పాండవులను వారణావతములో లక్క ఇంట్లో ఉంచి వారిని దహించివేయాలని పధకం వేశాడు. కానీ విదురుని సహాయంతో వారు తప్పించుకున్నారు.
ద్రౌపది స్వయంవర సమయంలో హాజరైన రాజులలో దుర్యోధనుడు ఒకడు. ద్రౌపది అర్జునుని వరించినందుకు కోపించి ద్రుపదునితో యుద్ధానికి దిగి భీమార్జునుల చేతిలో పరాజితుడై వెనుదిరిగాడు. ద్రుపదుని ఆశ్రయంలో ఉన్న పాండవుల మధ్య పొరపొచ్చాలు సృష్టించి పాండవులను తుదముట్టించాలని తలపెట్టి, కర్ణుని సలహాతో వారిని తిరిగి హస్తినకు రప్పించాడు. భీష్ముని సలహా, కృష్ణుని ప్రోద్బలంతో రాజ్యవిభజన జరిగింది. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకుని కృష్ణుని సహాయ సలహాలతో రాజ్యవిస్తరణచేసుకొన్న పాండవుల వైభవాన్ని చూసి ఓర్వలేక పోయాడు. మేనమామ శకుని కుతంత్రంతో పాండవులను మాయాజూదంలో ఓడించి వారిని అవమానించాడు. ద్రౌపదిని నిండు సభకు పిలిపించి ఆమె వస్త్రాపహరణానికి ప్రయత్నించాడు.
ధృతరాష్ట్రుని నుండి పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి వరంగా పొందారు. ఆ రాజ్యాన్ని తిరిగి మాయాజూదంలో అపహరించి వారిని అరణ్యవాసానికి, తరువాత అజ్ఞాతవాసానికి పంపి వారిని కష్టాలకు గురిచేసాడు. మైత్రేయుని హితవచనాలను అలక్ష్యం చేసినందుకు భీముని చేతిలో తొడ పగుల కలదని అతడి శాపానికి గురయ్యాడు. దుర్యోధనుని మరణం భీముని చేతిలో ఉన్నదన్న విషయం దానితో మరింత బలపడింది. సంజయుని ద్వారా కిమ్మీరుని వధ వృత్తాంతం విని, భీముని పరాక్రమానికి వెరచి, అరణ్యవాస సమయంలో పాండవుల మీదకు దండయాత్రకు వెళ్ళాలన్న ప్రయత్నాన్ని కొంతకాలం విరమించుకున్నాడు. పాండవులను పరిహసించి అవమాన పరచాలన్న దురుద్దేశంతో వచ్చి గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో సకుంటుంబంగా బందీ అయ్యాడు. తుదకు ధర్మరాజు సౌజన్యంతో, భీముడి పరాక్రమంతో ఆ గంధర్వుని నుండి విడుదల పొందాడు. ధర్మరాజు సౌజన్యాన్నికూడా అవమానంగా ఎంచి ఆత్మహత్య తలపెట్టాడు. కానీ, రాక్షసుల సలహాననుసరించి ఆత్మహత్యను విరమించుకున్నాడు.
అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టి వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో విరాటరాజ్యం పై దండెత్తి అర్జునిని చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. యుద్దకాలంలో సంధికి వ్యతిరేకంగా వ్యవహరించి యుద్ధానికి కాలుదువ్వాడు. దురహంకారంతో కృష్ణుని సహాయాన్ని వదులుకుని దైవబలాన్ని జారవిడుచుకున్నాడు. మాయోపాయంతో శల్యుని తనవైపు యుద్ధం చేసేలా చేసుకున్నాడు. తద్వారా కర్ణుని పరాజయానికి పరోక్షంగా కారణమైనాడు. పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుని అధర్మ మరణానికి కారకుల్లో ఒకడైనాడు. యుద్ధాంతంలో మరణభయంతో సరస్సులో జలస్తంభన చేసిన దుర్యోధనుడు భీముని చేతిలో నిస్సహాయంగా మరణించాడు.
ఈ విధంగా కౌరవకుల నాశనానికి దుర్యోధనుడు కారణమయ్యాడు.

ప్రవృత్తి

శ్రీకృష్ణుడు రాయబారం కోసం హస్తినకు వెళ్ళినపుడు దుర్యోధనుడు స్వయంగా తానే చెప్పుకున్న మాట, అతడి ప్రకృతిని తెలియజేస్తుంది.
జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః
జానామి అధర్మం న చ మే నివృత్తిః[1]
నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ నాకది చెయ్యాలనిపించదు...
అధర్మం ఏమిటో కూడా తెలుసు, నాకు అదే చెయ్యాలనిపిస్తుంది.
==వివాహం==దుర్యోధనుడు భానుమతిని వివాహమాడాడు

దుశ్శాసనుడు

దుశ్శాసనుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభలో ద్రౌపతి వస్త్రాపహరణానికి పూనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అభయ హస్తంతో ద్రౌపతి గౌరవం కాపాడాడు. శ్రీకృష్ణుడి మాయ వల్ల ద్రౌపతి చీరను లాగి, లాగి దుశ్శాసనుడు ఆ సభలో బాగా అలసిపోతాడు.

జననం

ధృతరాష్ట్ర పత్నియైన గాంధారి గర్భం మామూలు కంటే చాలా కాలం అలాగే ఉంటుంది. ఒకవైపు తన భర్త సోదరుడైన పాండురాజు పత్ని కుంతీ దేవికి అప్పుడే ఇద్దరు సంతానం కలుగుతారు. ఆమె ఈర్ష్యతో తన గర్భాన్ని చేత్తో కొట్టుకుంటుంది. అప్పుడామె గర్భంలోంచి ఇంకా పూర్తిగా ఎదగని మాంసపు ముద్ద బయట పడుతుంది. ఆమెకు భయం వేసి వ్యాసుడి సహాయం కోరుతుంది. వ్యాసుడు అంతకు మునుపే ఆమెకు నూర్గురు సంతానం కలిగేలా వరం ఇచ్చి ఉంటాడు. అందుకోసమని ఆ పిండాన్ని నూరు భాగాలుగా విభజించి నేతి పాత్రలలో భద్రపరుస్తాడు. వాటిని అలాగే మూసివేసి నేలలో ఒక సంవత్సరం పాటు భద్రపరుస్తాడు. ఒక సంవత్సరం తరువాత దుర్యోధనుడు ఒక కుండని చీల్చుకుని బయటకు వస్తాడు. దుశ్శాసనుడు భయటకు వస్తాడు.

ద్రోణాచార్యుడు

భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగ రాజ్యం ఇస్తానని మాటిచ్చాడు. ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తరువాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ జననానంతరం అతనిని పోషించటం కూడా వీలుకాని దుర్భర దారిద్యంతో బాదపడుతున్న తరుణంలో బాల్య మిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకుని ఆతని సహాయం కోరటానికి వెళతాడు. ద్రుపదుడు అతనిని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించ లేని ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునిని సహాయంతో ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించటం భారతంలో ఒక ప్రధాన ఘట్టం.
అతనికి భార్యాబిడ్డలమీద ఉన్న అత్యంత ప్రీతి కారణంగా ఎలాగైనా ధనం సంపాదించాలని కోరిక ఉండేది.పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు. ద్రోణుడు అక్కడకు చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేసాడు. పరశురాముడు ద్రోణుని చూసి "నాదగ్గర ఉన్న ధనమంతా దానం చేసాను ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్రవిద్య మాత్రమే ఉన్నాయి కాబట్టి అస్త్రవిద్య కావాలంటే నేర్పుతానని చెప్పాడు. ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరువాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది.
ద్రోణాచార్యుడు మహాభారతంలో కౌరవులకూ మరియు పాండవులకు రాజగురువు. దేవశాస్త్రాలతో సహా యుద్ధ విద్యలలోనూ, అస్త్ర శస్త్ర విద్యలలోనూ ఆరి తేరిన వాడు. అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి. ద్రోణుడికి అర్జునుడి కన్న ప్రియమైన వారు ఎవరున్నా ఉన్నారంటే అది తన కుమారుడు అశ్వథ్థామ.

కృపాచార్యుడు

కృపాచార్యుడు శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో ఇతడు ఒకడు. ఎనిమిదిమంది చిరంజీవులలో ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన పరీక్షిత్తుకు ఆచార్యునిగా నియమింపబడ్డాడు.

జననం

గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు.. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. ఆమె శరధ్వంతుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై అది రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతనునితో తన సంగతి చెప్పి కృపునకు చతుర్విధ ధనుర్వేదములును నానా విధ శాస్త్రములను నేర్పాడు. అతడే విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు.

అశ్వత్థామ

అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కడు ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వథ్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు.
ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు.
వీరు.....
1. అశ్వత్థామ,
2. బలిచక్రవర్తి.
3. వ్వాసమహర్షి.
4. హనుమంతుడు.
5. విభీషణుడు.
6. కృపాచార్యుడు.
7. పరశురాముడు.
మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటి పూట ఎలా దాడి చేస్తాయో, అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందర్నీ గంగానదీ తీరానికి తరలించాడు.
అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపదీ పుత్రులైన ఐదుమంది ఉపపాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేక పోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్ళిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్టించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. అశ్వత్థామను 3 వెల సంవత్సరాలపాటు కుష్టు వ్యాధి గ్రస్థుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు

గొంతెమ్మ కోరికలు

అందరం చిన్నప్పుడు ప్రకృతి వికృతి అంటూ పదాలు చదువుకున్నాం కదా. కుంతీదేవి పేరులోని కుంతి అనే మాటకి వికృతి పదం గొంతి.
మహాభారతంలో కుంతి మొదటి పేరు పృథ. యాదవరాజయిన శూరుడి పెద్ద కుమార్తె ఆమె. అయితే శూరుడి మేనత్త కుమారుడు కుంతిభోజుడు. సంతానం లేక అలమటిస్తున్న అతనికి తన పెద్ద కుమార్తె పృథను దత్తత ఇచ్చాడు శూరుడు. కుంతి భోజుడి కూతురుగా పెరిగింది కనుక ఆమె పేరు కుంతి అయింది. కుంతి భోజుడి ఇంటికి అతిథిగా వచ్చిన దూర్వాసమహామని ఆమె చేసిన సేవలకి మెచ్చి ఆపద్ధర్మంగా ఓ వరం ఇచ్చాడు. అంటే ఆపదలో ఉపయోగించుకోమని. అయితే కన్నెపిల్లగా ఉన్న కుంతి చపలమనస్క గా ఆ మంత్రం శక్తిని పరీక్షించాలనుకుని సూర్యడిని తనకు సంతానం ఇవ్వమని వేడుకుంది. సద్యోగర్భంతో సూర్యుడిద్వారా పుత్రుడిని పొందింది. ఈ విధంగా కన్యగా ఉండి ఫలితాన్ని ఆలోచించకుండా సంతానంకావాలని ఆమె కోరిన కోరిక కుంతమ్మ కోరిక గా గొంతెమ్మ కోరిక అయింది.
భారతయుద్ధం సమయంలో తన పుత్రుడయిన కర్ణుడు, అర్జునుడి సమానమైన శౌర్యం కలవారని యుద్ధంలో ఎవరో ఒకరే మిగులుతారని తెలిసినా, ఒక తల్లిగా ఇద్దరూ ఓడిపోకూడదని కోరుకుంది.
ఇలా సాధ్యంకాదని తెలిసినా కోరుకునే కోరికలు, ఇబ్బందులు తెచ్చిపెట్టేకోరికలు గొంతెమ్మకోరికలు గా జాతీయమైంది.

నలభీమ పాకము

పురాణాలలో నలుడు, భీముడు అనే ఇద్దరు మహారాజులే అయినా అవసరార్థం వంటవారుగా మారి అందరికీ రుచికరమయిన వంటలు చేసి పెట్టారు అని వర్ణించారు.దమయంతి భర్త నలుడు ఋషపర్ణుడి వద్ద వంటవాడిగా చేసి అద్భుతంగా వండి వార్చాడట. మహాభారతంలో భీముడు విరాటపర్వంలో రహస్యంగా జీవించడం కోసం రాజుగారి వద్ద వంటవాడిగా ఉంటానని తనంతట తానే ఆపని ఎంచుకున్నాడు. పురాణాలలో వీరిద్దరి వంట పనిని కవులు చాలా గొప్పగా వర్ణించారు.
ఇటీవలి కాలంవరకు గృహాలలో స్త్రీలు మాత్రమే వంట చేయడం జరిగింది. మగవారు ఏదైనా సందర్భంలో వంటఇంటిలో చేరి వండినప్పుడు దానిని పురాణపురుషులైన నలుడు భీముడు చేసిన వంటతో పోల్చి నలభీమ పాకం అనడం ఒక జాతీయమయింది.