వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

19 వ శ్లోకం

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్ ||1-19|| .

ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు.
మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది.

మాద్రి

మాద్రి పాండురాజు భార్య. పాండవులలో నకుల సహదేవులకు తల్లి. ఒకనాడు పాండురాజు ఒంటరిగా ఉన్న మాద్రిని సమీపించి దాంపత్య సుఖం పొందాడు. ముని శాప ఫలితంగా వెంటనే మృతి చెందాడు. మాద్రి పతితో పాటు సతీ సహగమనం చేసింది. పాండు పుత్రులను సంరక్షించే నిమిత్తంగా కుంతి బ్రతికి ఉంది

దుర్వాసుడు

దూర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

అంబరీషుని కథ

భాగవతంలో వచ్చే అంబరీషుని కథ చాలా ప్రాచుర్యం పొందింది. అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. ఆయన ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి నారాయణుని మెప్పించి సుదర్శన చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల ఆయన రాజ్యం సంపద, శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. రాజ్యానికి రక్షణ కవచంగా కూడా ఉంది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు. ఈ వ్రతం ప్రకారం ఆయన ఏకాదశి ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి రోజున ముగించి ప్రజలందరికీ భోజనం పెట్టాల్సి ఉంటుంది.

మహాభారతంలో

మహాభారతంలో దుర్వాసుడు ఆయనను తమ భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో ముఖ్యమైన ఘట్టం కుంతీదేవి బాల్యంలో జరిగింది. కుంతీ చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు ఆయన దగ్గరకు అతిథిగా వస్తాడు. ఆయన దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు. ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకుని బాగా సేవలు చేస్తుంది. దుర్వాసుడు అందుకు సంతుష్టుడవుతాడు. ఆయన తిరిగి వెళ్ళేటపుడు ఆమెకు అథర్వణ వేదం లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది. దీని సాయంతోనే ఆమె ముగ్గురు పాండవులను సంతానంగా పొందుతుంది. పెళ్ళి కాక మునుపే సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానంగా పొందుతుంది. కానీ అవివాహిత కావడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బిడ్డను నదిలో వదిలి వేస్తుంది.

కర్ణుడు

కర్ణుడు మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించాడు.

కర్ణుడి పూర్వ జన్మ

కర్ణుడిని పూర్వ జన్మలో సహస్రకవచుడు అనేవారు. అతనికి వేయి కవచాలు ఉండేవి. అతనికి ఉన్న 1000 కవచాలు నరనారాయణులు ఛేదించి సంహరిస్తారు. అతడే తరువాత జన్మలో సహజ కవచకుండలాలతో కర్ణుడిగా కుంతి గర్భాన జన్మించాడు. నరనారాయణులు (శ్రీ కృష్ణార్జునులు) అతన్ని కురుక్షేత్ర సంగ్రామములో సంహరించ్చారు. కుంతి కన్యగా ఉండునపుడు సూర్యప్రసాదమున పుట్టిన కొడుకు. చూ|| కుంతి. ఇతఁడు పుట్టినతోడనే కుంతి ఇతనిని దైవికముగా అప్పుడు దొరకిన ఒక మంజసయందు పెట్టి గంగలో పడవైచి తన యింటికి పోయెను. అంతట సూతవంశోధ్భవుఁడు అగు అతిరథుఁడు అనువాఁడు తన భార్య అగు రాధయు తానును గంగ యందు జలక్రీడలు ఆడుచు ఉండి ఆ మంజసను కనిపెట్టి తెచ్చి తెఱచి అందు సూర్యునివలె వెలుఁగుచున్న బాలకుని చూచి 'బిడ్డలులేని మనకు దైవము ఈబిడ్డను ఒసంగెను' అని అనుకొనుచు వానిని ఎత్తుకొనిపోయి పెంచుకొనిరి. అది కారణముగ కర్ణుఁడు సూతపుత్రుఁడు అనియు రాధేయుడు అనియు చెప్పఁబడును. వీఁడు సహజకర్ణ కుండలుఁడు అగుటవలను కర్ణుడు అనియు, వసువర్మధరుఁడు కావున వసుసేనుడు అనియు నామములు పడసెను. (వసువు = బంగారు. వర్మము = కవచము.)
మఱియు కర్ణుని పెంపుడుతండ్రి అగు సూతుఁడు అస్త్రవిద్యాభ్యాసమునకై రాజకుమారులకు ఎల్ల అస్త్రవిద్య కఱపుచు ఉన్న ద్రోణాచార్యులు సకలవిద్యలను నేర్పెను కానీ మంత్రసహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రము అతనికి ఇవ్వడానికి నిరాకరించెను. అంతట కర్ణుఁడు ఎట్లయిన ఆ అస్త్రాలను గ్రహింపవలెను అను తలఁపున బ్రాహ్మణవేషము వేసికొనిపోయి పరశురాముని ఆశ్రయించి ఆయనవద్ద సాంగముగా అస్త్రవిద్య అభ్యసించి ద్రోణునికి ప్రియశిష్యుడు అగు అర్జునుని యెడల మత్సరము కలిగి ఉండెను. కనుక దుర్యోధనుడు ఈతనిని తనకు పరమాప్తునిగా చేసికొని అంగదేశ రాజ్యాభిషిక్తునిగ చేసెను. ఈతఁడు బ్రాహ్మణవేషముతో పరశురామునియొద్ద విలువిద్య నేర్చకొనునపుడు ఆయన ఈదొంగతనమును తెలిసికొని తాను ఉపదేశించిన మహాస్త్రములు ఇతనికి ఆపత్కాలమున ఫలింపకపోవునట్లు శాపము ఇచ్చెను.
ఇదిగాక కర్ణుఁడు విలువిద్య అభ్యసించువేళ ఒకనాడు ఒక భయల విలుసాధన చేయుచు ఉండఁగా ఒక బాణము అచ్చట మేయుచున్న ఒక బ్రాహ్మణుని ఆవుపెయ్య మీదపడి అది చచ్చెను. దానికి ఆబ్రాహ్మణుఁడు కోపించి కర్ణునికి సమరోద్రేకమున రథచక్రము పుడమిని క్రుంగునట్లును, ఏవీరుని మార్కొని గెలువకోరి పోరునో ఆవీరునిచే అతఁడు చచ్చునట్లును శపించెను. ఈతడు మహాదాత. సూర్యప్రసాదమువలన పుట్టినపుడే తాను పడసి ఉండిన సహజ కవచ కుండలములను ఇంద్రుడు అర్జునుని మేలుకై బ్రాహ్మణవేషము తాల్చి వచ్చి తన్ను యాచింపఁగా అది తెలిసియు వెనుదీయక ఇచ్చివేసెను. కనుకనే "అతిదానాద్ధతఃకర్ణః" అని అంటారు.

ధర్మరాజు

యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు
పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు.
విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ధృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్థరాజ్యాన్ని పాండవులకు పంచి ఇచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్రప్రస్థం అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి యిచ్చాడు.
తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా నిర్వహించాడు. యాగ సభలో శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇఛ్ఛి పూజించాడు. ఆ సందర్భంగా తనను అవమానించిన చేది రాజైన శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఖండించాడు. మయసభ విశేషాలను తిలకించడానికై విడిదిచేసిన దుర్యోధనుడు అవమానానికి గురయ్యాడు.
అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరియైన శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. దుశ్శాసనుడు పాంచాలిని జుట్టుపట్టి బలవంతంగా సభలోకి ఈడ్చుకొని వచ్చాడు. ద్రౌపదిని వివస్త్రను చయ్యవలసినదిగా దుర్యోధనుడు తమ్ముని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయమైన వస్త్రాలను అనుగ్రహిమ్చి ఆమె మానాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పును గ్రహించి, వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య విముక్తుల్ని కావించి, వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు.
మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలిచాడు. ఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి అనేది పందెం. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటకువెళ్ళిన భీముని కొండచిలువ చుట్టేసి భక్షించబోయింది. ధర్మరాజు తమ్ముని వెదుకుతూ అక్కడకు వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి, తమ్మున్ని విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి నహుషుడు అనే మహారాజయ్యాడు.

భీమసేనుడు

భీముడు వాయుదేవుని అంశమున జన్మించిన కారణంగా పుట్టుకతోనే అమితబలశాలి. పుట్టిన పదవ రోజున భీముడు తల్లి చంక నుంచి జారి ఒక రాతి మీద పడినాడు. భీముని తాకిడికి ఆ రాయి చూర్ణం అయినది. దుర్యోధనుడు నీటిలో పడవేసి చంపడానికి ప్రయత్నిస్తే నాగలోకానికి చేరి వెయ్యి ఏనుగుల బలం వచ్చే ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు.
భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరునిగా పేరొందిన వీరుడు. మగధరాజైన జరాసంధుని మల్ల యుద్ధంలో నిర్జించిన జట్టి. ఏకచక్రపురాన్ని పట్టి పీడిస్తున్న బకాసురున్నీ, అతని సోదరుడు కిమ్మీరున్నీ వధించిన మేటి. హిడింబాసురుణ్ణి వధించి, తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు.
కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించినాడు.

అర్జునుడు

అర్జునుడు పాండవ మధ్యముడు. మహాభారత ఇతిహాసములో ఇంద్రుడి అంశ మరియు అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు. పాండు రాజు సంతానం. కుంతికి ఇంద్రుడుకి కలిగిన సంతానం.

జననం

పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీదేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ ధర్మరాజును ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; భీముడు జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. అర్జునుడు జన్మించాడు.అలాగే కుంతి మాద్రీ దేవికి ఆ మంత్రం ఉపదేశించి ఒక్కసారిమాత్రమే ఇది పనిచేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకొమ్మనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రానికి ఇద్దరు జన్మించేలా దేవవైద్యులైన అశ్వినీ దేవతలను ప్రార్థంచి ఇద్దరు పిల్లలను పొందింది. ఇలా పంచపాండవుల జననం జరిగింది.

వ్యక్తిత్వం

మహాభారతం అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ, ఆరోగ్యకరమైన, దృఢమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ, మరియు ప్రతి తల్లితండ్రీ, ప్రతి భార్య, ప్రతీ స్నేహితుడు, గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవానిగా అభివర్ణించింది.మొత్తం నలుగుర్ని వివాహమాడాడు. స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు. గొప్ప వీరుడైన సాత్యకి అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావయైన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. కొంచెం మృధు స్వభావి మరియు మంచి ఆలోచనాపరుడు కూడా. అందుకనే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీత బోధించవలసి వచ్చింది.

విద్యార్థిగా

అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. చిన్నపుడు అత్యుత్తమ విద్యార్థి. గురువు ద్రోణాచార్యుడు చెప్పిన ఏ అంశాన్నైనా ఇట్టే గ్రహించే వాడు.

భర్తగా

ఈతడికి ద్రౌపతితోపాటు ఉలూచి, చిత్రాంగద, సుభద్ర భార్యలుగా కలరు.

కర్తవ్య పాలనలో

పాండవులు తమ ఉమ్మడి భార్యయైన ద్రౌపది సంసార జీవనం సాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నపుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంధ్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నపుడు ఒక సారి బ్రాహ్మణుడొకడు, అర్జునుని సహాయాన్ని అభ్యర్థించాడు. అతని పశుసంపదలను ఎవరో దొంగల ముఠా తోలుకెళ్ళారనీ, వారి నుంచి తన పశు సంపదను కాపాడమని అర్జునుని వేడుకొన్నాడు. కానీ అర్జునుని ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది మరియు యుధిష్టురుడు ఏకాంతంగా ఉన్న గదిలో ఉండిపోయి నందున వారికి భంగం కలిగించడం నియమాలకు వ్యతిరేకం కనుక సందిగ్ధంలో పడ్డాడు. కానీ సహాయార్థం వచ్చిన బ్రాహ్మణోత్తముని తిప్పి పంపటం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి ఆ శిక్ష గురించి జంకకుండా వారున్న గదిలోకి వెళ్ళి ఆయుధాలు తీసుకొని పశువులను దొంగలించిన వారికోసం వెళ్ళాడు.
ఆ పని పూర్తయిన వెంటనే ధర్మరాజు మరియు ద్రౌపదితో సహా కుటుంబం మొత్తం వారిస్తున్నా ఒక సంవత్సరం పాటు తనకు తానే బహిష్కరణ విధించుకున్నాడు

అరణ్య వాసం మరియు అజ్ఞాతవాసం

అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా బృహన్నల వేషం ధరించాడు. అరణ్యవాసం విదించిన ఐదవ సంవత్సరంలో హిమలయాలకు వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు.

యుద్ధం

మహాభారత సంగ్రామంలో అర్జునునిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథి, మరియు బావయైన శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. దీనినే హిందూ సంస్కృతిలో భగవద్గీత అంటారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన గ్రంథం.

యుద్ధానంతరం

మహాభారత సంగ్రామానంతరం పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. గొప్ప విజయం, కౌరవులకు మద్ధతు పలికిన అనేక మంది రాజలను ఓడించడం, మొదలైన అనేక కారణాల వల్ల వారు అశ్వమేధ యాగం చేయ సంకల్పించారు.

ఇతర పేర్లు

1.పార్థుడు 2.జిష్ణు
3.కిరీటి
4.విజయుడు
5.కపిధ్వజుడు
6.సవ్యసాచి
7.బీభత్సుడు
8.ఫల్గుణుడు
9.ధనంజయుడు
10.గాండీవి
11.శ్వేతవాహనుడు
12.గూడకేశుడు

నకులుడు

నకులుడు పాండవ వాల్గవవాడు. మహాభారత ఇతిహాసములొ అశ్వనీ దేవతల అంశ. పాండు రాజు సంతానం. మాద్రి కి దూర్వాసుని మంత్ర ప్రభావం మూలంగా అశ్వనీ దేవతలకి కలిగిన సంతానం

సహదేవుడు

సహదేవుడు మహాభారత ఇతిహాసములొ పాండవులలో ఐదవవాడు. అశ్వనీదేవతల అంశ. పాండు రాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి మాద్రి అశ్వనీదేవతలచే నకుల సహదేవులను కన్నది.
పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం ఉపపాండవులలో శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృత్తిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. (Ref: Mbh 1. 223). సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిగిన పుత్రుడు సుహోత్రుడు. (MBh.1.95). సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే)
ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు "తంత్రీపాలుడు" అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు.
యుధిష్ఠిరుడు రాజయినాక దక్షిణదేశ దండయాత్రకు సహదేవుని పంపాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయంచాడు. సహదేవుడు బృహస్పతి వలె గొప్ప వివేకము కలవాడని, రాబోవు ఘటనలను ముందుగానే ఊహింపగలడని, కాని శాపవశాన భవిష్యత్తును ముందుగా చెప్పలేదని ప్రతీతి.